ఎక్కువ పాన్‌కార్డులుంటే అంతే సంగతి

న్యూఢిల్లీ: ఆర్థిక లావాదేవీలు ప్ర‌త్యేకించి బ్యాంక్ ఖాతా తెర‌వ‌డానికి, వ్యాపార వాణిజ్య కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు, ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి అత్యంత ముఖ్య‌మైన ప‌త్రాల్లో ప‌ర్మ‌నెంట్ అకౌంట్ నంబ‌ర్ (పాన్‌). 10-డిజిట్ పాన్ నంబ‌ర్‌ను ఆదాయం ప‌న్నుశాఖ కేటాయిస్తుంది. ఆదాయం ప‌న్ను చెల్లింపుదారుడు పాన్ కార్డ్ క‌లిగి ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. అయితే దేశీయంతా కొంత మంది ఎక్కువ పాన్ కార్డులు క‌లిగి ఉండ‌టం బ‌య‌ట ప‌డుతున్న‌ది. ఆదాయం ప‌న్ను (ఐటీ) శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ ఒక్క‌రూ ఒక‌టి కంటే ఎక్కువ పాన్ కార్డ్ క‌లిగి ఉండ‌రాదు. పాత పాన్ కార్డుపై క్రెడిట్ స్కోర్ బ్యాడ్‌గా ఉంటే, రుణాలు తీసుకోవ‌డం కోసం కొంతమంది ఉద్దేశ‌పూర్వ‌కంగా ఒక‌టికంటే ఎక్కువ పాన్‌కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తుంటారు. మ‌రి కొంద‌రు త‌మ ఆదాయాన్ని విభ‌జించి ప‌న్ను చెల్లింపుల భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి ఒక‌టికంటే ఎక్కువ పాన్ కార్డులు తీసుకుంటారు. ఇక కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు అజాగ్ర‌త్త‌తో, అనుకోకుండా ఒక‌టి కంటే ఎక్కువ పాన్‌కార్డులు క‌లిగి ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక‌వేళ మొదటి పాన్ కార్డు కోల్పోతే, దాని డూప్లికేట్ కోసం అభ్య‌ర్థించ‌కుండా కొత్త కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేస్తుంటారు. అత్య‌ధిక కేసుల్లో మ‌హిళ‌ల వివాహ‌మైన త‌ర్వాత వారి ఇంటి పేరు మారుతుంది. ఇటువంటి సంద‌ర్భాల్లో ఒరిజిన‌ల్ కార్డును అప్‌డేట్ చేయ‌డానికి బ‌దులు కొత్త పాన్ కార్డు కోసం మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేస్తుంటారు. కానీ ఆదాయం ప‌న్నుశాఖ 272బీ సెక్ష‌న్ ప్ర‌కారం ఎవ‌రైనా రెండు పాన్‌కార్డులు క‌లిగి ఉంటే రూ.10 వేల వ‌ర‌కు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించ‌డం ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి. దీనివ‌ల్ల ఒక‌టికంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న సంగ‌తిని గుర్తించ‌డం ప్ర‌భుత్వానికి తేలిక‌వుతుంది. క‌నుక మీరు ఒక‌టి కంటే ఎక్కువ పాన్ కార్డులు క‌లిగి ఉండ‌డాన్ని నిరుత్సాహ ప‌ర్చండి. ఎందువ‌ల్ల‌నైనా మీరు బ‌హుళ పాన్ కార్డులు క‌లిగి ఉంటే అందులో ఒక‌దానిని క్యాన్సిల్ లేదా స‌రెండ‌ర్ చేసుకోవ‌డం ఉత్తమం అని ఆదాయం ప‌న్నుశాఖ చెబుతున్న‌ది. పాన్ కార్డును ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్ లైన్‌లోనూ సరెండ‌ర్ చేయొచ్చు.

బ‌హుళ పాన్‌కార్డుల ర‌ద్దుకు ఆన్‌లైన్ ప్ర‌క్రియ  

తొలుత ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి. ‘అప్లికేష‌న్ టైం’ నుంచి డౌన్‌కెళ్లి ‘ప్ర‌స్తుత పాన్ కార్డు డేటా/ ‌పాన్‌కార్డు రీప్రింట్‌లో మార్పులు లేదా క‌రెక్ష‌న్‌’ అనే ఆప్ష‌న్ ఎంచుకుఓవాలి. దాన్ని పూర్తిగా నింపిన త‌ర్వాత ‘స‌బ్‌మిట్‌’ బ‌ట‌న్ నొక్కాలి. స‌బ్‌మిట్ బ‌ట‌న్ నొక్కిన త‌ర్వాత మీ విజ్ఞప్తి రిజిస్ట‌ర్ అయి మీరు న‌మోదు చేసిన ఈ-మెయిల్ ఐడీకి టోకెన్ నంబ‌ర్ వస్తుంది. అప్పుడు ఒక పేప‌ర్‌పై స‌ద‌రు టోకెన్ నంబ‌ర్‌ను రాసుకుని భ‌విష్య‌త్ సంప్ర‌దింపుల కోసం దాచిపెట్టుకోవాలి. త‌ర్వాత ‘కంటిన్యూ విత్ పాన్ అప్లికేష‌న్ ఫామ్‌’ బ‌ట‌న్‌ను కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఆ త‌ర్వాత మీ ముందు న్యూ వెబ్‌పేజీ జ‌న‌రేట్ అవుతుంది. ఆ పేజీ టాప్‌లో ‘ఈ-సంత‌కం ఆప్ష‌న్ ద్వారా స్కాన్డ్ ఇమేజ్‌ల‌ను స‌బ్‌మిట్ చేయాలి’. మీరు కొన‌సాగించాల‌ని భావిస్తున్న పాన్ నంబ‌ర్‌ను, అటుపై మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం, కాంటాక్ట్ ఇత‌ర వివ‌రాలు న‌మోదు చేశాయి. త‌దుప‌రి మీ వ‌ద్ద గ‌ల అద‌న‌పు పాన్ కార్డుల‌ను స‌రెండ‌ర్ చేస్తున్న‌ట్లు పేర్కొన్న త‌ర్వాత ‘నెక్ట్స్‌’ బ‌ట‌న్‌తో ప్రొసీడ్ కావాలి. గుర్తింపు కార్డు, నివాస గుర్తింపు, జ‌న్మించిన తేది త‌దిత‌ర వివ‌రాల‌ను పూరించాలి. అటుపై మీ ఫొటోగ్రాఫ్‌, సిగ్నేచ‌ర్, ఇత‌ర స్కాన్డ్ ఇమేజీల‌ను అప్‌లోడ్ చేయాలి. మీరు పాన్ నంబ‌ర్ స‌రెండ‌ర్ చేస్తున్న‌ట్లు అభ్య‌ర్థిస్తే, మీకు ఒక ఎక‌నాలెడ్జ్ నంబ‌ర్ వ‌స్తుంది. ఫామ్ పూరించిన త‌ర్వాత ఫైన‌ల్ స‌బ్‌మిట్ చేసుముందు ఒక‌సారి ఎడిట్ చేసుకుంటే ఉత్త‌మంగా ఉంటుంది. పాన్ కార్డును ర‌ద్దు చేయాల‌ని పేర్కొంటూ మీ వివ‌రాల‌న్నీ పూరించిన త‌ర్వాత ఈ ప్ర‌క్రియ కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ క్రెడిట్‌/ డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయ‌చ్చు. అటు త‌ర్వాత ఎక‌నాలెడ్జ్‌మెంట్‌ను భ‌ద్ర‌ప‌రుచుకోవాలి. ‘అప్లికేష‌‌న్ ఫ‌ర్ పాన్ క్యాన్సిలేష‌న్‌’ అని రాసి ఉన్న క‌వ‌ర్‌లో ఎన్ఎస్డీఎల్ ఈ-గ‌వ్ ఎక‌నాలెడ్జ్‌మెంట్ ప్ర‌తి, రెండు మీ ఫొటోగ్రాఫ్‌లు ఆదాయం ప‌న్నుశాఖ‌కు పంపాలి. అవ‌స‌ర‌మైతే డిమాండ్‌డ్రాఫ్ట్‌తోపాటు సంత‌కం చేసిన ఎక‌నాలెడ్జ్‌మెంట్ ప్ర‌తి, పాన్ కార్డు, నివాస‌, గుర్తింపు ప‌త్రాలు, జ‌న్మ‌దిన ధ్రువీక‌ర‌ణ‌లు పంపాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లో మ‌ల్టీపుల్ పాన్‌కార్డుల క్యాన్సిలేష‌న్ ఇలా:  

పాన్ కార్డ్ మార్పు లేదా క‌రెక్ష‌న్ కోసం ఫాం 49ఏ ఫిల్ చేసి స‌మీపంలోని యూటీఐ లేదా ఎన్ఎస్డీఎల్ టిన్ ఫెసిలిటీ సెంట‌ర్‌కు వెళ్లాలి. మీ ప‌రిధిలో ఐటీ చెల్లింపుల అసెస్‌మెంట్ అధికారికి లేఖ రాయాలి. పాన్‌కార్డ్‌, జ‌న్మ‌దిన‌తేదీ, ఇత‌ర పాన్ కార్డు నంబ‌ర్లు, ఇత‌ర వివ‌రాలు తెలియ‌జేయాలి. స‌మీపంలోని ఐటీ శాఖ‌కు లేఖ పంపాలి.