హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థలతో పాటు ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి వస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ వస్తుందని తెలిపారు. ఇది దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ అని పేర్కొన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ సానుకూలమని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ స్పష్టం చేశారు.
