మహిళా సంఘాల ఆర్థిక స్థితి మెరుగు పర్చేలా సహజ బ్రాండ్ :కోప్పుల ఈశ్వర్

మహిళలు అభివృద్ది చెందడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక స్థితిగతులను మార్చేలా సహజ బ్రాండ్ రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోన్నాల గార్డెన్స్ లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సహజ బ్రాండ్ ద్వారా SHG ఉత్పత్తుల మార్కేటింగ్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.

ఈ సందర్బంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడిన వివిధ ఉత్పాదనలకు మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశ్యంతో, గత 6నెలలుగా కృషి చేసి సహజ బ్రాండ్ ను పైలెట్ ప్రాజెక్టు ద్వారా జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసుకొవడం జరిగిందని తెలియజేశారు.
మహిళలకు వస్తుఉత్పాదన, మార్కేటింగ్ మరియు వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో అవగహన కల్పించి, సుశిక్తులైన మహిళామణులను నైపుణ్య వంతులుగా తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
మన జిల్లాలో లక్షా 60వేల మంది గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మహిళ సంఘ మహిళలు ఉన్నారని, వారు వివిధ సంఘాల ద్వారా బ్యాంకుల నుండి ఋణాలు తీసుకుని తిరిగి చెల్లించడం వరకు మాత్రమే కాకుండా, సంఘాలకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశ్యంతో సహజ బ్రాండ్ కు శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కోన్నారు.
గతంలో ఎస్టి శాఖ ద్వారా గిరి అనే బ్రాండ్ ఉత్పాదనలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇది పూర్తిగా ప్రభుత్వ పరంగా నిర్వహించబడుతుందని మరియు గిరి ఉత్పాదనలు మార్కేట్ లో మంచి పేరును సంపాధించుకోవడంతో పాటు పెద్దపెద్ద దుఖాణాలలో ఈ ఉత్పాదనలకు మంచి డిమాండ్ ఉందని తెలియజేశారు.
అదే పద్దతిలో సహజ బ్రాండ్ ద్వారా వివిధ రకాల వస్తువులకు ప్రాముఖ్యత లభించేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ఇదివరకే గ్రామ, మండలం మరియు నియోజక వర్గంలో మహిళలు వివిధ రకాల ఉత్పాదనలు తయారు చేసినప్పటికి, వాటికి సరైన గుర్తింపు లభించక పోవడంవలన వస్తువులకు మార్కెటింగ్ లేనందునే, ఈ సహజ బ్రాండ్ ద్వారా ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అందరు వాడేలా చేయడంతో పాటు, మనం కూడా వాడేలా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యంగా కార్యక్రమానికి ఎర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
గిరి ఉత్పాదనలు తయారుచేసే సంస్థలతో సహజ బ్రాండ్ ఉత్పాదనలను తయారు చేయించడం జరుగుతుందని, తద్వారా మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన సాదిస్తారని తెలియజేశారు. ఉత్పాదనలపై అభిప్రాయాలు,సందేహాలు సేకరించాలని, తద్వారా సమస్యలను మొదటిస్థాయిలోనే పరిస్కరించుకోగలుగుతామని అన్నారు. జిల్లాలో మహిళా సంఘాలను ప్రామాణికంగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు సహజ బ్రాండ్ కు రాష్ట వ్యాప్తంగా వృద్ది చేసేలా ప్రతి ఒక్కరు పాటుపడడంతో పాటు, కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ బ్రాండ్ శాస్వతంగా నిలిచిపోయోల కృషి చేయాలని అన్నారు. మహిళలచే ఒక్కపైసా పెట్టుబడి కూడా పెట్టనివ్వకుండా, తయారు చేసిన వస్తువుల మార్కేటింగ్ బాద్యత మాత్రమే ఇవ్వడం జరిగిందని, నేడు కోన్ని ఉత్పాదనలతో ప్రారంభమై దినదినాభివృద్దితో, మహిళలు ఉత్పిత్తి చేసిన ప్రతి వస్తువులతో పెద్ద వ్యవస్థంగా రూపాంతరం చేందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సహజ ఉత్పాదన ద్వారా ప్రతి ఒక్కటి లభించేలా కృషి చేసి పూర్తినాణ్యతతో ఉండాలని అన్నారు. అధికారులు నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. స్తీనిధి ద్వారా ప్లాస్టిక్ బ్యాగులకు వ్యతిరేకంగా తయారు చేయబడుతున్న జూట్ బ్యాగుల ఉత్పాదనలు మంచి ప్రాముఖ్యతను సంపాదించాయని, మహిళా సంఘాల ఆర్థిక స్థితిని మార్చడానికి సంఘాల ద్వారా హైదరాబాదులో నిర్వహించబడే సంస్థను మహిళలు పరిశీలించి, మరింత కృషి చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా పరిమితంగా వారి ఉత్పాదనలు ఉండేవని, వారి ఉత్పాదనలను పరిమితంగా కాకుండా వాటికి బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశ్యంతో సహజ బ్రాండ్ పేరుతో రిజిష్టర్ చేసుకొవడం జరిగిందని, ఎదైన ఎజేన్సి ద్వారా రెండు ఉత్పాదనలను తయారు చేయించి మార్కెటింగ్ కల్పించడం జరిగుతుందని, అనంతరం అంచలంచలుగా ఇతర వస్తువులను కూడా తయారు చేసి అందరిలో నమ్మకాని కలిగించి జిల్లా సమాఖ్య, మండల సమాఖ్యా మరియు మహిళా సంఘాల ద్వారా అమ్మకాలు జరపాలని అన్నారు.
జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలోని మహిళల ద్వారా ఉత్పత్తి చేసిన ఉత్పాదనలకు సహజ బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ కల్పించడం చాల సంతోషకరమైన విషయమని, మహిళలు స్వయం సహయక బ్రందాలు వారి కాళ్లమీద వారు నిలుచోవాలనే సంకల్పతో ఏర్పాటు చేసిన మహిళా సంఘాలను రూపకల్పన చేయడం జరిగిందని, సంఘాల ద్వారా తయారు చేయబడిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించి మరింత అభివృద్ది పరచాలనే సంకల్పంతొ సహజ బ్రాండ్ పేరుతో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించే విధంగా కొన్ని కంపెనీల అనుబంధమై వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం మాత్రమే కాకుండా బ్యాంక్ లింకేజీ ద్వారా ఋణాలు ఇప్పించి అందరిని సమన్వయ పరిచేలా కృషి చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు కోప్పుల ఈశ్వర్ గారిని అభినందనలు తెలియజేశారు.
డిసియంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా సాధికరతతో ఎదైన సాధించగలమన నానుడిని నిజం చేస్తూ మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు సహజ బ్రాండ్ అనే పేరుతో మార్కెటింగ్ కల్పించి మహిళల ద్వారా తయారు చేయబడిన వస్తువులకు మార్కెట్ కల్పించి, మహిళల అభ్యన్నతి కృషిచేస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత మాట్లాడుతూ, మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించి వారి అభ్యన్నతికి కృషిచేస్తున్న మంత్రి వర్యులకు ఈ సందర్బంగా అభినందలు తెలియజేశారు. గ్రామ స్థాయి నుండి జిల్లా వరకు మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కేటింగ్ కల్పించాలనే సంకల్పంతో ఎన్నో రోజులు కృషి చేసి మహిళలచే సహజ సిద్దంగా ఎటువంటి కల్తిలేకుండా తయారు చేసే వస్తువులకు సహజ బ్రాండ్ అని నామకరణం చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కోన్నారు. కల్తిలేకుండా తయారు చేసే వస్తువులును కేవలం గ్రామస్థాయిలోనే కాకుండా రాష్ట్రాలకు, దేశాలకు పరిచయం చేసే విధంగా మహిళలో ఉన్న శక్తిని వెలికి తీసి మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో, మహిళలను మరింత శక్తివంతంగా తయారు చేయంతో పాటు మహిళలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీస్తూ మహిళల అభ్యున్నతికి పాటుపడంటం జరుగుతుందని పెర్కోన్నారు. మహిళలు శక్తివంతంగా ఉంటే ఆ ఇళ్లు కలకలాడుతుందని సంకల్పించి మహిళల అభివృద్దికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడంతో పాటు అభ్యున్నతికి వెన్నంటి ప్రోత్సహన్నందిస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులకు కృతజ్ఞతాభి వందనాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలొ పిడి డిఆర్డిఏ లక్ష్మీనారాయణ, జిల్లా సమాఖ్య అద్యక్షురాలు వనితా మంజూలా, వివిధ సంఘాల మహిళలు,అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.