జగ్గయ్యపేట,తీస్మార్ న్యూస్:జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో వైయస్ఆర్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం అయిన తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది.