ప్రాణాల మీదకు తెచ్చిన పతంగి

జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పతంగి ఎగరేస్తూ ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. జనగామకి చెందిన ఓ యువతి భవనంపై నుంచి గాలిపటం ఎగరేసింది. పతంగి ఎగరేసే ఉత్సాహంతో తానున్నది బిల్డింగ్‌ పైన అనే విషయం యువతి మర్చిపోయింది. ఒక్కో అడుగూ వెనక్కి వేసుకుంటూ వచ్చి భవనం పైనుంచి అమాంతం పడిపోయింది. అయితే అదే సమయంలో అక్కడ ఓ ఆటో నిలిపి ఉండడంతో దానిపై పడింది. ఆటో అద్దం పూర్తిగా ధ్వంసమైంది. అది టాప్‌లెస్ ఆటో కావడంతో గాయాలతో బయటపడింది. స్థానికులు గుర్తించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.