జగన్ లాంటి సీఎం ఉండడం ఏపీ ప్రజల…..

ఇది విమర్శకులు చూస్తే భజన అనుకుంటే అనుకోవచ్చు. అభిమానులు మురిసిపోవచ్చు. కానీ తటస్థులుగా ఉన్న వారి కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం ఇందులో నిజం ఉంది అనిపించకమానదు. నిజమే జగన్ చేతికి ఎముక లేకుండా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశమే ఆశ్చర్యపోతోంది.ఎక్కడా ఇన్ని పధకాలు లేవు, పేదల కోసం ఇంతలా తపన పడుతున్న సన్నివేశాలు లేవు. ఓ వైపు చూస్తే అన్నింటా చితికిన రాష్ట్రంగా ఏపీ ఉంది. కరోనా వచ్చి మొత్తం ప్రపంచాన్నే ఆర్ధికంగా లేవనీయంతగా కాటేసింది. అయినా సరే ఏపీలో ఏ ఒక్క కార్యక్రమం ఆగలేదు.ఆఖరుకు రేషన్ సరకులు కూడా పేదల ఇంటికే ఠంచనుగా చేరవేసేందుకు బృహత్తర కార్యక్రమం చేపడుతున్నారు. జగన్ ది జాలి గుండె. ఆయన పేదల ఏలిక. అందుకే మంత్రి కురసాల కన్నబాబు ఒకే మాట అంటున్నారు.జగన్ లాంటి సీఎం ఉండడం ఏపీ ప్రజల అదృష్టం. అయన మనసు ఎల్లపుడూ పేదల కోసమే ఆలోచిస్తుంది. ఇలాంటి సీఎం దేశంలో ఎవరూ లేరు. మళ్ళీ జగన్ లాంటి వారు పుట్టబోరు అంటూ ఎమోషనల్ గా కన్నబాబు పలికిన పలుకుల్లో సత్యం ఎంతో ఉంది. నిజంగా మనసున్న వారు మహరాజు స్థానంలో ఉంటే జరిగే అద్భుతాలు ఏంటో జగన్ కళ్లారా చూపించారు. తానేంటో కూడా నిరూపించుకున్నారు.