ఓఆర్ఆర్‌పై వాహ‌నాల రాక‌పోక‌లు బంద్‌

హైద‌రాబాద్ : కొత్త సంవ‌త్స‌రం ప్ర‌వేశం నేప‌థ్యంలో ప్ర‌మాదాల నివార‌ణ‌కు పోలీస్‌శాఖ అప్రమ‌త్త‌మై ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే నేటి రాత్రి న‌గ‌రంలోని ఫ్లైఓవ‌ర్ల‌ను బంద్ చేస్తున్న‌ట్లు తెలిపిన ఆ శాఖ తాజాగా ఔట‌ర్ రింగ్ రోడ్డుపై వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిషేదించిన‌ట్లు వెల్ల‌డించింది. రాత్రి 10 నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఓఆర్ఆర్‌పై వాహ‌న రాక‌పోక‌ల‌ను నిషేధించింది. కాగా శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వెల్లే వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమ‌తి తెలిపింది. మిగ‌తా వాహ‌నాల‌కు అనుమ‌తులు లేవ‌ని పేర్కొంది.