వాటర్ ట్యాంక్ లో అస్థి పంజరాలు

పతంగులు ఎగురవేస్తూ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చిన పిల్లలకు అక్కడ దుర్వాసన వచ్చింది. దీంతో వెంటనే వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించారు. వాటర్ ట్యాంక‌లో అస్థి పంజరాలు కలకలం రేపాయి. రెండు అస్థి పంజరాల్ని చూసిన స్థానికులు అవి పిల్లలవని అనుమానిస్తున్నారు. ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. జిల్లా నర్మెటలో వాడుకలో లేని ఓ వాటర్‌ ట్యాంక్‌లో రెండు అస్థి పంజరాలు వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది. నర్మెట మండలకేంద్రం నుంచి జనగామ వెళ్లే దారిలో ఉపాధి హామీ పథకం కింద ఓ వ్యవసాయ కేంద్రంలో నర్సరీ ఉండేది. కొన్నేళ్లుగా దీని నిర్వహణ సరిగా లేకపోవడంతో నర్సరీ కోసం ఏర్పాటుచేసిన వాటర్‌ ట్యాంక్‌ను నిరుపయోగంగా వదిలేశారు.వాటర్ ట్యాంకులో అస్థి పంజరాల అయితే శుక్రవారం కొందరు పిల్లలు పతంగులు ఎగరేసుకుంటూ ట్యాంకు వైపు వెళ్లగా దుర్వాసన రావడంతో వెంటనే స్థానికులకు చెప్పారు. వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ రాపెల్లి సంతోష్‌కుమార్‌ వెళ్లి అస్థి పంజరాలను పరిశీలించారు. వాటర్‌ ట్యాంక్‌ చాలా ఎత్తులో ఉండటం వల్ల కోతులు ఆడుకుంటూ అందులో పడి చనిపోయి ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇద్దరు చిన్నారులను చంపేసి అందులో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.