సోషల్ మీడియా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం:దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్,తీస్మార్ న్యూస్:టీ.ఆర్.ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణ,పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.