హైదరాబాద్ : సంక్రాంతి పండగ పూట నగరంలోని చిక్కడపల్లిలో విషాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకుడు బంగారు కృష్ణ మూడో అంతస్తు పైనుంచి గాలిపటం ఎగరవేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. ప్రహరీగోడపై అమర్చిన ఇనుపరాడ్లపై పడటంతో కృష్ణకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. తీవ్ర గాయాలపాలైన కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ మృతిపట్ల పలువురు టీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.