జీడిమెట్ల డివిజన్ లో రూ.1.28 కోట్ల అభివృద్ధి పనుల శంఖుస్థాపనలో ఎమ్మెల్యే..
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గ నిర్దేశకత్వంలో కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రాగా టూల్స్, పైప్ లైన్ రోడ్డు, శ్రీరామ్ నగర్, గోదావరి హోమ్స్, బజ్రంగ్ హిల్స్, వెంకటేశ్వర కాలని, ఎంఎన్ రెడ్డి నగర్ లలో రూ.1.28 కోట్లతో నూతనంగా చేపడుతున్న సీసి రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని యువ నాయకులు కేపి విశాల్ గౌడ్ గారితో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి కాలనీ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాబోయే రోజుల్లో మరింత ప్రణాళికబద్ధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్ మాధవ రెడ్డి, మధుసూధన్ రాజు, చెన్నా రెడ్డి, విఠల్, రాజలింగం, సురేష్, కాలని వాసులు నాగేష్ గౌడ్, పీర్ గౌడ్, డాక్టర్ రవీంద్ర, గొరిగె నర్గింగ్ రావు, కాలే నాగేష్, తిరుమల్ రావు, సుధాకర్ రావు, శ్యామ్, గొరిగె అరుణ్ కుమార్, వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, నాగ శేఖర్ గౌడ్, ఇందిర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.