టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే తెలిపారు.గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పేర్కొన్నారు.