నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…

హైదరాబాద్‌ : నగరంలోని ఐఎస్‌ సదన్‌ రూట్‌లో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి సంతోష్‌నగర్‌ వరకు జీహెచ్‌ఎంసీ, ఎంవీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్న ఎల్వేటెడ్‌ కారిడార్‌(స్టీల్‌ బ్రిడ్జి) నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 11 నుంచి  ఫిబ్రవరి 11 వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. 3.38 కిలోమీటర్ల మేర చేపట్టనున్న స్టీల్‌ బ్రిడ్జి పనుల్లో భాగంగా ప్రస్తుతం దోబీఘాట్‌ జంక్షన్‌ నుంచి ఐఎస్‌ సదన్‌ జంక్షన్‌, చంచల్‌గూడ జంక్షన్‌ నుంచి సైదాబాద్‌ ఎక్స్‌ రోడ్స్‌ వరకు పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. నిర్మాణ పనులతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడనుండడంతో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ తెలిపారు.

ప్రత్యామ్నాయ రూట్లు

నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి సంతోష్‌నగర్‌కు వయా ఐఎస్‌ సదన్‌ మీదుగా వెళ్లే భారీ వాహనాలు దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ మీదుగా.. సంతోష్‌నగర్‌ వైపు నుం చి నల్గొండ క్రాస్‌రోడ్స్‌కు వచ్చే వాహనాలు డీఎంఆర్‌ఎల్‌ క్రాస్‌రోడ్స్‌, సాగర్‌ రింగ్‌ రోడ్డు, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. సాధారణ ట్రాఫిక్‌ నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఐఎస్‌ సదన్‌ వైపు వెళ్లే వారు మలక్‌పేట్‌ ఫైర్‌ స్టేషన్‌, అక్బర్‌బాగ్‌, బి బ్లాక్స్‌, సైదాబాద్‌ కాలనీ, శంకేశ్వర్‌బజార్‌, సింగరేణి కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఐఎస్‌ సదన్‌ రూట్‌లో వెళ్లాలి.డీఎంఆర్‌ఎల్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి నల్గొండ క్రాస్‌రోడ్స్‌ వైపు వచ్చే వాహనాలు ఐఎస్‌ సదన్‌, చంపాపేట్‌, సింగరేణి కాలనీ, శంకేశ్వర్‌బజార్‌, గడ్డిఅన్నారం రోడ్డు లేదా సైదాబాద్‌ కాలనీ, అక్బర్‌బాగ్‌, మలక్‌పేట్‌ ఫైర్‌ స్టేషన్‌ వద్ద మెయిన్‌ రోడ్డుకు చేరుకోవాలి