నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు

హైదరాబాద్‌ : ఇందిరా పార్కు నుంచి వీఎస్‌టీ వరకు నిర్మించనున్న నాలుగు లేన్‌ల స్టీల్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు కొత్త ఏడాది జనవరి 2 నుంచి ప్రారంభం కానుండటంతో.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

  1. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచి హిందీ మహావిద్యాలయ వైపు వచ్చే వాహనాలు.. చిక్కడపల్లి మార్కెట్‌-నారాయణగూడ ఎక్స్‌ రోడ్డు ఎడమవైపు-క్రౌన్‌ కేఫ్‌, బర్కత్‌పుర పెట్రోల్‌ పంప్‌-ఎడమ తీసుకుని ఫీవర్‌ దవాఖాన, విద్యానగర్‌ ప్రధాన రహదారికి చేరుకోవాలి.
  2. హిందీ మహావిద్యాలయ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు వచ్చే వాహనాలు.. ఫీవర్‌ దవాఖాన-బర్కత్‌పుర పెట్రోల్‌ పంప్‌-కుడి వైపు తీసుకుని-క్రౌన్‌ కేఫ్‌-నారాయణగూడ క్రాస్‌ రోడ్డు -కుడి వైపు తీసుకుని-చిక్కడిపల్లి మార్కెట్‌-ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుకు చేరుకోవాలి.
  3. బాగ్‌ లింగంపల్లి నుంచి వచ్చే వాహనాలు.. రాంనగర్‌-క్రౌన్‌ కేఫ్‌-బర్కత్‌పుర పెట్రోల్‌ పంప్‌-ఎడమ వైపు తీసుకుని-ఫీవర్‌ దవాఖాన, విద్యానగర్‌ ప్రధాన రహదారి, హిందీ మహావిద్యాలయ, అడిక్‌మెట్‌-రాంనగర్‌కు చేరుకోవాలి.
  4. రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వెళ్లే వాహనాలు.. రాంనగర్‌ క్రాస్‌ రోడ్డు-రాంనగర్‌ గుండు-కుడి వైపు తీసుకుని  అడిక్‌మెట్‌-హిందీ మహావిద్యాలయ- విద్యానగర్‌-ఫీవర్‌ దవాఖాన-బర్కత్‌పుర పెట్రోల్‌ పంప్‌-కుడివైపు తీసుకుని క్రౌన్‌ కేఫ్‌- ఎడమవైపు తీసుకుని వెళ్లాలి.