హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ క్రమంలో బాపుఘాట్, లంగర్‌హౌజ్, నానల్ నగర్, ఆంధ్రా ఫ్లోర్ మిల్, సంగం బస్టాప్ పరిసరాల్లో ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.