హైదరాబాద్,తీస్మార్ న్యూస్:క్రిస్మస్,నూతన సంవత్సరం వచ్చిందంటే మందుబాబులకి పండుగే..సమయంతో పని లేకుండా ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్లపై తిరుగుతుంటారు.అలా తిరుగుతూ ప్రమాదాలకు గురి కావడం,ప్రమాదాలకు కారణం అవుతుంటారు.కరోనా కారణంగా బ్రీత్ ఎనలైజర్స్ అనుదుబాటులో లేకపోవడంతో కొత్త మార్గాల అన్వేషణలో పడ్దారు పోలీసులు. తాగిన వారి కళ్ళు ఎర్రగా మారుతాయి అలా ఉంటే మద్యం సేవించినట్టు అర్థం చేసుకోవాలి.వేళ్ళు లెక్కపెట్టించడం,గీత గీసి దానిపైన నడిపించడం వంటివి చేసి,మద్యం సేవించిన వ్యక్తులను గుర్తించనున్నారు.అలా గుర్తించిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు చేపించి ఫైన్ వేయనున్నారు పోలీసులు.మందుబాబులకి ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.
