మంత్రి మల్లారెడ్డి కాలేజీ బ్యాన్

హైదరాబాద్, తీస్మార్ న్యూస్:హైదరాబాద్ దూలపల్లిలోని తెలంగాణ లేబర్ మినిస్టర్ మల్లారెడ్డికి చెందిన కాలేజీపై 5 ఏళ్ళ పాటు నిషేధం విధిస్తున్నట్టు నేషనల్ అసేస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(NACC) ప్రకటించింది.మంచి గ్రేస్ సాధించాలనే దురుద్దేశంతో నకిలీ డాక్యుమెంట్లు పంపించడంతో..ఈ విషయాన్ని గుర్తించిన న్యాక్ ఈ మేరకు చర్యలు తీసుకుంది.

బీహెచ్ఈఎల్, యాస్ టెక్నాలజీ, ఎయిర్ టెల్ కు సంబంధించిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు పెట్టి
న్యాక్ గ్రేడ్ పొందే ప్రయత్నం చేసింది. వృత్తి విద్యకు సంబంధించిన ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ కాలేజీలకు న్యాక్ గుర్తింపు చాలా ముఖ్యమనది. దాంతో క్యాంపస్ ప్లేస్ మెంట్, విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో న్యాక్ గ్రేడ్ ఉందని కాలేజీలు ప్రచారం చేసుకుంటాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యాక్ గుర్తింపును పొందేందుకు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ను మల్లారెడ్డి ఇంజినీరింగ్ సబ్ మిట్ చేశారు.

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ రాష్ట్రమంత్రి మల్లారెడ్డికి సంబంధించింది కావడంతో ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితమే మాల్లారెడ్డి యూనివర్సిటీ
మంజూరయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులు విద్యావేత్తల్లోగానీ, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లోగానీ మల్లారెడ్డి, మల్లారెడ్డి విద్యా సంస్థలు చర్చనీయాంశం అయ్యాయి.

ప్రధానంగా ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, మెడికల్ కు సంబంధించి దాదాపు 20 కాలేజీలు మల్లారెడ్డికి సంబంధించినవి ఉన్నాయి. ఇందులో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎమ్ ఆర్ ఐటీకి సంబంధించిన క్యాంపస్-1 దూలపెళ్లి రోడ్, మైసమ్మగూడ అడ్రస్ కల్గిన మాల్లారెడ్డి ఇంజనీరింగ్
ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు.

5-11-2019 లో తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దానిపై స్పందించకపోవడంతో మరోసారి రిఫర్ చేశారు. దీనిపై మీరు దృష్టి పెట్టాలి..ఇప్పటికే మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం…ఏం చేశారంటూ కూడా
న్యాక్ అడిగింది. కానీ దానికి రిప్లై ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు న్యాక్ గ్రేడ్ కు అప్లై చేసుకునేందుకు అవకాశం లేకుండా మల్లారెడ్డి ఇంజనీరింగ్ పై నిషేధం విధించారు.మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ తప్పుడు పత్రాలను పెట్టి న్యాక్ గ్రేడ్ సంపాదించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు, తమ పిల్లలను చేర్పించాలనుకుంటున్న తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఒక వేళ న్యాక్ గ్రేడ్ కోల్పోయి ఉంటే అక్కడికి వచ్చే క్యాంపస్ ప్లేస్ మెంట్లు, విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులపై కొంత మరక వచ్చే అవకాశం ఉంటుంది. కాలేజీ యాజమాన్యమే తప్పుడు పత్రాలతో గుర్తింపు పొందే ప్రయత్నం చేసిన నేపథ్యంలో విద్యార్థులకు ఎంతమేరకు చదువును అందిస్తుందనేది కొంత అనుమానాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.