పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

ఓ వైపు కరోనా మరోవైపు భారీ వర్షాలతో ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. 2020-21 సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ. రాష్ట్రంలోని మిగిలిన పట్టణాల్లో రూ.10వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు మంత్రి శ్రీ కేటీఆర్ ప్రకటించారు.