జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు, కారుణ్య నియామ‌కాలు, ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్లు, రైతు వేదిక‌లు, వైకుంఠ‌ధామాలు, హ‌రిత వ‌నాలు, ఉపాధి హామీ పనుల‌పై సీఎస్ క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్షించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇవ్వాలని, కారుణ్యనియామకాలలో ఎలాంటి జాప్యం జరుగవద్దని చెప్పారు. పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఏర్పడే ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు.