హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కారణంగా నిన్న సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఇవాళ మరికొన్ని పరీక్షలు చేయించుకునేందుకు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్లనున్నారు. ఎంఆర్ఐ, సిటీస్కాన్‌తో పాటు తదితర పరీక్షలు సీఎం చేయించుకోనున్నారు.