పీవీ నిరంతర సంస్కరణ శీలి :కేసీఆర్
మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. శ్రీ పి.వి. నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన రంగాలలో శ్రీ పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారత దేశం అనుభవిస్తున్నదని. అంతర్గత భద్రత, విదేశాంగ, వ్యవహారాల్లోనూ శ్రీ పి.వి అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచిందిని సీఎం కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన శ్రీ పి.వి. కి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం గుర్త చేశారు.
Chief Minister Sri K. Chandrashekar Rao said that former Prime Minister Sri PV. Narasimha Rao would remain in the country’s history forever as a staunch reformer. The CM remembered and recalled PV on his death anniversary today. The CM said the country is enjoying the results of reforms that were ushered in by PV in the field of education, economy, land, administration and other sectors. The CM hailed that the firm attitude put forth by Sri PV. Narasimha Rao in internal security and external affairs, diplomacy had strengthened the country’s unity, integrity and sovereignty. The CM said that the state government is conducting PV’s year-long centenary celebrations with a lot of responsibility and respect and as a befitting tribute to the polyglot, multifaceted and great administrator that Sri PV. Narasimha Rao was.