హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై సైతం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్, యాదాద్రి కలెక్టర్, రోడ్లు భవనాలశాఖ అధికారులు, ఆలయ ఈవో హాజరుకానున్నారు.
