రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్‌, గ‌ద్ద‌ల ప‌ద్మ‌, కుమ్ర ఈశ్వ‌రీబాయి, సూదం ల‌క్ష్మి, ఉమాదేవి యాద‌వ్‌, రేవ‌తీరావు భాద్యతలు స్వీక‌రించారు. బుద్ధ‌భ‌వ‌న్ క‌మిష‌న్ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.