కామారెడ్డి,తీస్మార్ న్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు క్రిషాంక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ & జుక్కల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండే గారు.ఈ సంధర్భంగా మాట్లాడుతు సోషల్ మీడి యాలో మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,కేంద్ర ప్రభుత్వం,భాజపా పార్టీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. క్రిషాంక్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాల గురించి, బిజెపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న అబద్ధపు ప్రచారాలను సాక్ష్యాలతో, ఫోటోలతో ప్రజెంటేషన్ చేస్తూ వివరిస్తూ,ప్రతి ఒక్క యువకుడు TRS పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరచిన నియోజక వర్గ సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ, వేరే పార్టీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ ప్రజలకు నిజాలు చెప్పాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గంప గోవర్దన్ గారు, శ్రీ సురేందర్ గారు, ఉమ్మడి జిల్లాల DCCB ఛైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు, కామారెడ్డి జిల్లా ZP ఛైర్మన్ శ్రీమతి దఫెదర్ శోబా రాజు గారు, రైసస అధ్యక్షులు అంజిరెడ్డి గారు, కామారెడ్డి మునిసిపాల్ ఛైర్ పర్సన్ జాహ్నవి గారు, వైస్ ఛైర్మన్ ఇందు ప్రియ గారు, మాజీ ZP ఛైర్మన్ శ్రీ దఫెదర్ రాజు గారు, రాష్ట్ర మైనారిటి అధ్యక్షులు, పలువురు సీనియర్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.



