పలు అబివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి

పరిగి నియోజకవర్గము పూడూర్ మండల కేంద్రంలో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనాలను,నజీరాబాద్ తండా వద్ద 90 లక్షలతో పరిగి మెయిన్ రోడ్డు వరకు వేసిన రోడ్డును,నస్కల్ లో రైతు వేదికను, దోమ మండల కేంద్రంలో రైతు వేదిక, జూనియర్ కళాశాల అదనపు గదులను ప్రారంభించి,కుల్కచర్ల లో కె జి బి వి లో అదనపు భవన నిర్మాణ పనులకు,దోమ లో లైబ్రరీ భవన నిర్మాణ పనులకు,రాకొండ లో పి ఎం జి ఎస్ వై రోడ్డు పనులకు,శంకుస్థాపన చేసిన, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.

పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమలలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు,డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి గార్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల తో కలిసి పాల్గొన్న విద్యా శాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు.

సుమారు 10 కోట్ల రూపాయల తో చేపట్టిన,పనులకు శ్రీకారం చుడుతూ పరిగి నియోజకవర్గ ములో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు

మొక్కజొన్న ల కొనుగోలు ను ప్రభుత్వం పొడిగించింది.

నియంత్రిత సాగులో భాగంగా మొక్క జొన్న పండించవద్దని చెప్పిన కొంత మంది రైతులు పండిస్తే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

రైతు పొలం దగ్గర పంట కొన్న ఏకైక ప్రభుత్వం.

తెలంగాణ లో 600 కోట్ల తో 2604 రైతు వేదికలు.

వికారాబాద్ జిల్లాలో 21 కోట్ల 34 లక్షల తో 97 రైతు వేదికల నిర్మాణం.

రైతు బంధు కింద 7300 కోట్లు విడుదల ,త్వరలో రైతుల ఖాతాలోకి జమ.

వికారాబాద్ జిల్లాలో 2 లక్షల 24 వేల మందికి రైతు బంధు

జిల్లాలో 300 కోట్లు రైతు బంధు సహాయం అందించటం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం10 వేలు ఎకరాకు ఇస్తున్న ప్రభుత్వం.

అర్హత ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు అందాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తపన.ఆ దశలో చిట్ట చివరి రైతుకు పంట సహాయం అందిస్తాం.

రైతు వేదికల దగ్గర చర్చించుకోండి.విలువైన సలహాలు సూచనలు ఇచ్చిపుచ్చుకోండి..అధికారులు కూడా అందుబాటులో ఉంటారు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు కాపాడుతూ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుండగా, కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది..

ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు ధర్నా చేస్తున్న స్పందించని కేంద్రం .

మన పత్తికి మంచి డిమాండ్.అమ్ముకోవాలంటే రైతు రక్త సంభదికులు ఉండాలనే నిబంధన తో రైతులకు కష్టాలు.

ప్రయివేటు మార్కెట్ లు వస్తే మార్కెట్ కమిటీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.

ప్రయివేటు మార్కెట్ లను ప్రోత్సహిస్తూ,వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం.

మద్దతు ధరలు లేకుండా కార్పొరేట్ కంపెనీలు నిర్ణయించే లే కేంద్రం తెచ్చిన నల్లా చట్టాలు.

ప్రతి ఎకరాకు నీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు.పాలమూరు రంగారెడ్డి తో రానున్న కాలంలో మన ప్రాంతం శష్యశామలం అవుతుంది.

అందరి కోసం తాపత్రయ పడుతూన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరూ ఆశీసులు అందించి అండగా ఉండండి.

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా స్వచ్ఛత దిశగా అడుగులు.

గ్రామాల్లో డంపింగ్ యార్డ్ లు,ప్రకృతి వనాలు,వైకుంఠ దామాలు,ట్రాక్టర్ లు సమకూర్చడం జరిగింది .

కరోనా తో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిన సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ నిధులు కోత విధించలేదు.

కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు,రైతు బంధు,లాంటి పథకాలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.

కోవిడ్ మరో దశలోకి వెళ్ళటం తో మరింత జాగ్రత్తగా ఉండండి.

గ్రామ పంచాయతీ లకు 339 కోట్లు ప్రతినెల అందిస్తున్న ప్రభుత్వం.

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ద్వెయం.