సీసి కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్ లో కాలని వాసుల సౌజన్యంతో రూ.1.80 లక్షలతో ఏర్పాటు చేసిన 17 సీసి కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని యువ నాయకులు కేపి విశాల్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీసి కెమెరాల ఏర్పాటుకు కాలని వాసులు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని, కాలనీల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సీసీ కెమెరాలు చక్కగా ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో సీసి కెమెరాల ఏర్పాటుకు కాలని వాసులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలని అధ్యక్షుడు వేణు గోపాల్, జనరల్ సెక్రెటరీలు రాజ నరేష్, శంకర్, వైస్ ప్రెసిడెంట్ టి.మల్లేష్, ట్రెజరర్లు విజయ్ కుమార్, సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.