సామాన్యుడిపై పెట్రో భారం

భారతదేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. ధరల పెంపునకు రెండు రోజులపాటు విరామమిచ్చిన పెట్రోలియం కంపెనీలు మళ్లీ పెట్రో బాదుడు మొదలుపెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 19 పైసలచొప్పున పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 82.66కు పెరగింది. అదేవిధంగా లీటర్‌ డీజిల్‌ ధర 72.84కు చేరింది. నిన్న రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

దేశంలో గత 14 రోజుల్లో పెట్రో ధరలు పెరగడం ఇది 11వ సారి. పెట్రో ధరల పెంపు నవంబర్‌ 20న ప్రారంభమైంది. ఢిల్లీతోపాటు మిగిన మెట్రో నగరాలైన ముంబైలో పెట్రోల్‌ ధర రూ.89.33, డీజిల్‌ ధర రూ.79.42, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.84.18, డీజిల్‌ రూ.76.41,చెన్నైలో రూ.85.59, డీజిల్‌ రూ.78.24, బెంగళూరులో పెట్రోల్‌ రూ. 85.42, డీజిల్‌ రూ.77.22, హైదరాబాద్‌లో రూ.85.97, డీజిల్‌ రూ.79.49గా ఉన్నాయి.