ఇస్లామాబాద్: తోడేలు ముసుగు ధరించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో డిసెంబర్ 31న ఈ ఘటన జరిగింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో స్థానికులను భయపెట్టేందుకు ఒక వ్యక్తి తోడేలు ముఖాన్ని పోలిన ఒక ముసుగును ధరించాడు. గమనించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పాకిస్థానీ జర్నలిస్ట్ ఒమర్ ఆర్ ఖురైషి ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. కాగా, కరోనా నేపథ్యంలో మాస్కులు, ముసుగులు ధరించడం ప్రస్తుతం కామన్ అయ్యిందని, అతడ్ని అరెస్ట్ చేయడం తగదని కొందరు నెటిజన్లు సానుభూతి తెలిపారు. అతడి కంటే మాస్కులు ధరించని పోలీసులే భయంకరంగా ఉన్నారని కొందరు కామెంట్లు చేశారు.