బిగ్ బాస్ షోలో సందడి చేసిన ఎన్టీఆర్ మరోసారి టీవీ షోతో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కానున్న టాక్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు ఓ న్యూస్ ఇప్పటికే ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ తెరపైకి వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ షో షురూ కానుందట. 60 ఎపిసోడ్స్ తో సాగనున్న ఈ షోకు ఎన్టీఆర్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు రూ.30 లక్షలు చొప్పున మొత్తం రూ.18 కోట్లు తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఒకవేళ ఈ న్యూస్ కన్ఫామ్ అయితే తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఇదే అత్యధిక రెమ్యునరేషన్ కానుందట.ఆర్ఆర్ఆర్ షూటింగ్ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి ముగిసేనాటికి ఎన్టీఆర్ ఫ్రీ కానుండగా..ఆ తర్వాత షోలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నకొత్త ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు తారక్. మీలో ఎవరు కోటీశ్వరుడు లైన్స్ లో ఈ టాక్ షో సాగుతుందని సమాచారం. ఎన్టీఆర్ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తుండగా. . దీనికోసం ప్రత్యేకంగా రెండు ఫ్లోర్ లను బుక్ చేసుకున్నారట.