అన్నదాతపై విషం చిమ్మిన ధర్మపురి అర్వింద్

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:బీజేపీ కాలకూట విషం చిమ్మే మాటలు తప్పులను ప్రశ్నించిన ప్రతి ఒక్కరూ ద్రోహేనన్న నిర్లక్ష్య ధోరణి దేశానికి అన్నం పెట్టే రైతన్నపై బ్రోకర్లు అనె ముద్రవేశారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.అర్వింద్ కూసిన పిచ్చి కూతలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.న్యూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల ఎంపీ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తుంది.మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆందోళన చేస్తున్నది నిజమైన రైతులు కాదని, వారంతా దళారులు అని వ్యాఖ్యానించారు. కమీషన్‌ ఏజెంట్ల ఉద్యమానికి సీఎం కేసీఆర్‌ మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. రైతుల ఆందోళనలకు ప్రభుత్వం ఇలాగే అండగా నిలబడితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని బెదిరింపులకు పాల్పడ్డారు. ఉద్యమం అంటే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో కేసీఆర్‌ చూస్తారని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందా? అని సవాల్‌ విసిరారు.

ఓటు వేసి గెలిపించినోళ్ళంతా బ్రోకర్లుగా కనిపిస్తున్నారా?:ప్రశాంత్‌రెడ్డి
డేశానికి వెన్నెముక అయిన రైతన్నను బ్రోకర్లుగా అభివర్ణించడం నిజామాబాద్‌ ఎంపీ అహంకారానికి నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి.. హక్కులకోసం, న్యాయం కోసం ఉద్యమిస్తున్న రైతులను చులకన చేసి మాట్లాడటం హేయమని ధ్వజమెత్తారు. పసుపుబోర్డు పేరుతో గెలిచి రైతులను నయవంచన చేసిన వ్యక్తికి రైతులు బ్రోకర్లుగానే కనిపిస్తారని, ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్య లు ఆయన పతనానికి ప్రారంభమని హెచ్చరించారు.