హైదరాబాద్ : రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి వారిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్ ఏసీపీగా కే వెంకట్‌రెడ్డి, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా భిక్షంరెడ్డి, పశ్చిమ మండల ట్రాఫిక్ ఏసీపీగా శ్రీకాంత్‌గౌడ్ బదిలీ అయ్యారు. పేట్ బషీరాబాద్ ఏసీసీగా రామలింగరాజు, షాద్‌నగర్ ఏసీపీగా కులష్కర్, సీఐడీ డీఎస్పీలుగా వి సురేందర్, శ్యామ్‌సుందర్, మామునూరు ఏసీపీగా ఏ నరేశ్‌కుమార్, రాజేంద్రనగర్ ఏసీపీగా సంజయ్‌కుమార్‌ను నియమించారు.
