ముఖ్యమంత్రి కీలక నిర్ణయం…జనవరి 2 వరకు కర్ఫ్యూ

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశ వ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో కరోనా కేసులున్నాయి.బ్రిటన్ కొత్త వైరస్ భారత్ లోకి ప్రవేశించిందనే వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి.ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందే వకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై నిషేధం విదించింది.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి జనవరి 2 వరకు కర్ఫ్యూ ప్రకటించింది.రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రజలు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.