2021 సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించిన ప్రపంచంలోని మొదటి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. ఇటీవల రెండవసారి కొవిడ్- 19 వ్యాప్తిని ఓడించిన దేశంగా నిలిచిన న్యూజిలాండ్.. నూతన సంవత్సరాన్ని అద్భుతమైన బాణసంచా ప్రదర్శనతో ఆహ్వానించింది. కొత్త సంవత్సరం వేడుకల విజువల్స్ బాణాసంచా ప్రదర్శనను చూడటానికి వాటర్ ఫ్రంట్ వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. న్యూజిలాండ్‌లో బాణసంచా ప్రదర్శన ఈ సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద న్యూ ఇయర్ బాణసంచా ప్రదర్శన అవనున్నది. ఇతర దేశాలలో ఎక్కువ మంది మహమ్మారికి గురవుతుండటం, అలాగే ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో టపాసులు కాల్చే అవకాశం ఉండనందున న్యూజిలాండ్ ఉత్సవాలు రికార్డు ప్రదర్శన కానున్నాయి. ఆక్లాండ్‌లో నూతన సంవత్సరం వేడుకలు అంబురాన్నంటాయి. వేలాది మంది జనం గుమిగూడి పెద్ద పెట్టున అరుస్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఎంజాయ్ చేశారు. భయంకరమైన టెర్రర్ దాడికి గురైన క్రైస్ట్‌చర్చ్ వద్ద 2021 కు స్వాగతం పలకడానికి బాణసంచా ప్రదర్శనను వైభవంగా నిర్వహించింది. కొత్త సంవత్సరం ఆహ్వానించే ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినట్లు సిటీ కౌన్సిల్ మేనేజర్ తాన్య కోకోజిక్ చెప్పారు. దేశవ్యాప్తంగా కివీస్ 2020 కు వీడ్కోలు పలకడానికి మరియు కొత్త సంవత్సరంలో స్వాగతం పలకడానికి పార్టీలు వేస్తున్నారు. సిడ్నీ కంటే రెండు గంటల సమయం ముందున్న న్యూజిలాండ్‌లో తొలుత నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. 2021 లో స్వాగతం పలికిన మొట్టమొదటి దేశం సమోవా రాజధాని నగరం అపియాలో బాణసంచా ప్రదర్శనతో దేశం నూతన సంవత్సరాన్ని గుర్తించింది.
