సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని చంద్ర నగర్, భగత్ సింగ్ నగర్, దుర్గయ్య నగర్, రొడామేస్త్రి నగర్, వివేకానంద్ నగర్ లకు చెందిన 14 మంది లబ్ధిదారులకు రూ.14,01,624 విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్వయంగా ఇంటింటికీ తిరిగి స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ గారితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాది ముబారక్ ప‌థ‌కం ఎంతో మంది నిరుపేద‌ల కుటుంబాల్లో వెలుగులు నింపిందని అన్నారు. పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహానికి గౌరవ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు ల‌క్షా నూట ప‌ద‌హారు రూపాయాలు అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు. దీంతో ఆడ‌బిడ్డ‌లు సీఎం కేసీఆర్‌ గారిని మేన‌మామ‌గా వ‌ర్ణించుకుంటూ.. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని చెబుతున్నారని అన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. సీఎం కేసీఆర్‌ గారి సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయణిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ గారు, మంత్రి కేటీఆర్ గారి నిర్ణయాలు రాష్ర్టాభివృద్ధి, పేదల సంక్షేమానికి మేలు చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, టీఆర్ఎస్ నాయకులు కర్నెకంటి మల్లేష్, లక్ష్మణ్ యాదవ్, రవి, మురళి, సాంబయ్య, ఉప్పలయ్య, వెంకటేష్ గౌడ్, శేఖర్ రావు, బస్వరాజ్, మధు, అఖిల్ సాయి గౌడ్, శ్రీశైలం యాదవ్, నర్సింహా, హరి, శ్రీధర్, సాయి, శానవాజ్, అఫ్సర్, రవుఫ్, సిరాజ్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.