బండి సంజయ్ పై మండిపడ్డ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బాల్క సుమన్
  • బండి సంజయ్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారు..
  • పీఎం తో సీఎం లు కలవడం సాధారణ విషయం

– రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ,పెండింగ్ బకాయిలు, రాష్ట్ర ప్రాజెక్టుల పై ప్రధాని ,కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారు

– రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేకం ఉంటాయి.. వాటి లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారు..

– సీఎం కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్లి ఏం చేశారని ప్రశ్నిస్తున్న బండి సంజయ్ కు ఢిల్లీ లో ఏం జరిగిందో తెలియదా..
– ఎంపీ గా ఉన్న వ్యక్తి కి కేంద్ర ,రాష్ట్ర సంబంధాలు తెలియవా..అవగాహన లేదా ?
– బండి సంజయ్ అడిగాడని కాదు. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం..
– ఎన్నో రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్..ఆయన గురించి మాట్లాడే ముందు ఆచీ తూచి మాట్లాడండి.
– స్థాయి లేని వాళ్ళు అంతా.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేవారే..
– కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారు..అర్ధరహితంగా మాట్లాడుతున్నారు
– మా పార్టీ నాయకత్వం ,కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవగహన పెంచుకొని మాట్లాడాలి..
– రాజ్యాంగ బద్ద వ్యవస్థ ల పై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలి
– బండి సంజయ్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారు..
పీఎం తో సీఎం లు కలవడం సాధారణ విషయం