మహబూబాబాద్ ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్‌ : మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు  మాలోతు కవితకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం రోజు పుట్టిన రోజు జరుపుకోవడం నూతన ఉత్తేజంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొంది, మహబూబాబాద్ ఎంపీగా కొనసాగుతున్న కవిత మరో పది కాలాల పాటు ప్రజా జీవితంలో ఉండాలని వారు ఆకాంక్షించారు. మరింత మంచి పేరు తెచ్చుకుంటూ.. ప్రజా సేవకు అంకితం కావాలని శుభాశీస్సులు అందజేశారు.