ఖమ్మం,తీస్మార్ న్యూస్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా భారీన పడ్డారు.సోమవారం నిర్వహించిన కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లోని తన నివాసంలో హోం ఐసోలేషన్లో ఉన్నానని తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. #RTPCR పరీక్షల్లో నాకు #covid19 పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.
