ట్రైటా క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం (ట్రైటా) డైరీ, క్యాలెండర్, గోడ క్యాలెండర్ ను నేడు హైదరాబాద్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆవిష్కరించారు. కోవిద్ నేపథ్యంలో కేంద్ర కార్యవర్గ సభ్యులతో వీటిని ఆవిష్కరించారు.

సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి కామెంట్స్…

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

2020 లో కరోనా వైరస్ వల్ల విద్యాలయాలు మూతపడి మన బిడ్డలకు చాలా ఇబ్బందులు జరిగాయి. కొత్త సంవత్సరంలో మన బిడ్డలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.

గురుకులాల లో పిల్లల భవిష్యత్ కోసం అనేక ప్రయోగాలు చేస్తూ గురుకులాల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది. మంచి విజయాలు నమోదు చేస్తున్నారు.

పిల్లల భవిత కోసం పాటుపడే
మీ సమస్యల పరిష్కారం కోసం మేము ఉన్నాము..కచ్చితంగా పరిష్కరిస్తాము .

మన పిల్లలుగా భావించి వారిని తీర్చిదిద్దే బాధ్యత మీది. మీ సమస్యలు తీర్చే బాధ్యత మాది. కాబట్టి మీ గౌరవానికి, గుర్తింపునకు భంగం కలగకుండా చూస్తాము.

సీఎం కేసిఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ గురుకులాలు పెట్టి, వారికి నాణ్యమైన విద్య, భోజనం కూడా అందిస్తున్నారు.

సీఎం కేసిఆర్ గారు ఏ ఉద్దేశ్యంతో గురుకులాలు పెట్టారో దానిని గుర్తించి మన బిడ్డలకు ఎక్కువ మేలు జరిగేలా…పెద్ద, పెద్ద కార్పొరేట్ విద్యాలయాల్లో లభించే విద్య, వసతుల కంటే మేము ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో మీరు చేస్తున్నారు. అందువల్లే మనకు మంచి పేరు వస్తుంది.

నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గిరిజన గురుకులాలు చూస్తున్నాను. తెలంగాణ వచ్చే వరకు ఒక ఎత్తు..ఇప్పుడు ఒక ఎత్తు. ఇప్పుడు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి.

కోవిడ్ సమయంలో ఏమి చేస్తే పిల్లలకు మేలు జరుగుతుందో అది చేయడం వల్ల కొంత మనం చేయగలిగాము.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే వెనుకడుగు వేసే వారు..కానీ ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో కనిపిస్తుంది. మీరు ఇస్తున్న విద్య, వస్తున్న ఫలితాలే ఈ డిమాండ్ కు కారణం.

దీనివల్ల మన బాధ్యత మరింత పెరిగింది. ఈ నమ్మకాన్ని కొనసాగిస్తూ..ఇంకా ఈ నమ్మకం పెంచేలా పని చేయాలి.

మా పరిధిలో ఉన్నాయి చేస్తాము…లేనివి సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా పని చేస్తాను.

మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కమిషనర్ శ్రీమతి క్రిస్టినా జెడ్ చొంగ్తూ కామెంట్స్….

మనకు ఎన్నో గర్వించే విజయ గాథలు ఈ ఏడాది మన విద్యాలయాల్లో ఉన్నాయి.

ఇక్కడ పని చేసే ఉపాద్యాయులు మా పిల్లలు అనే అంకితభావంతో పని చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యం.

మన గురుకులాలు ఎన్నో ప్రైవేట్ సంస్థలకంటే చాలా మెరుగు.

మీ కృషి కచ్చితంగా అభినందనీయం.

గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్…

ఈ సంవత్సరం మాకు ఛాలెంజింగ్…గత ఏడాది 39 మంది డాక్టర్లు అయితే…ఈసారి 78 మంది డాక్టర్లు కావాలి.

2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 100 మందిని ఐఐటి, నిట్, సెంట్రల్ యూనివర్సిటీ లకు పంపించాలి.

అంతరించి పోతున్న ఆదిమ జాతులకు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి వారిని కూడా ఐఐటీ లకు పంపుతున్నందుకు సంతోషంగా ఉంది.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి క్రిస్టినా జెడ్ చోంగ్తు, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, యూనియన్ అధ్యక్షులు రుషికేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్యాణి, సమన్వయ కార్యదర్శి విజయ లక్ష్మి, ఇతర నాయకులు పాల్గొన్నారు.