మన్సూరాబాద్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన MLA శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఈరోజు తేదీ 11-11-2020 బుధవారం ఉదయం 7-00 గంటల నుండి మన్సూరాబాద్ డివిజన్ లోని పెద్ద చెరువు, చిన్న చెరువు, వీకర్ సెక్షన్ కాలనీ లో 39.80 లక్షలతో కమిటీ హాల్ కు శంఖుస్థాపన , ఆగమయ్య నగర్ కాలనీ లో వారి స్వంత ఖర్చులతో C.C. కెమెరాలకు ప్రారంభోత్సవం, వీరభద్ర నగర్ కాలనీ లో 21 లక్షలతో C.C. Road కు శంఖుస్థాపన , సి.ఎస్.ఆర్. కాలనీ లో 95 లక్షలతో C.C. Road కు శంఖుస్థాపన , ఆకాష్ నగర్ కాలనీ లో 44.5 లక్షలతో C.C. Road కు శంఖుస్థాపన , మొదలగు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలను మన MLA Sri Devireddy Sudhir Reddy Garu మరియు కార్పోరేటర్ శ్రీ కొప్పుల విఠల్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీ టంగుటూరి నాగరాజు గారితో కలిసి ప్రారంభోత్సవం చేశారు.

MLA గారు మాట్లాడుతూ ఇంకా further గా కూడా Problems ను find out చేసి ఆ సమస్యలను కూడా విడతల మాదిరిగా పరిష్కరిస్తామని ఈసందర్భంగా తెలియజేశారు.

కరోనా మహమ్మారి వల్ల మరియు ఇటీవల్ల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన రాష్ట్రం ఆర్థికంగా ఒక సంవత్సరం వెనుకబడిన కూడా, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 2100 కోట్లకు గాను 120 కోట్లు మాత్రమే వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా అమలు చేసేందుకు కృషి చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే మనకు నిత్యం వెన్నంటి ఉండి మన నియోజకవర్గానికి, మన డివిజన్ కు అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేస్తున్న మన డైనమిక్ MLA శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి అలాగే నిత్యం మన అందరికీ అందుబాటులో ఉంటున్న కార్పోరేటర్ శ్రీ కొప్పుల విఠల్ రెడ్డి గార్లకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన డివిజన్ అధ్యక్షులు శ్రీ టంగుటూరి నాగరాజు గారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, సబ్ కమిటీ సభ్యులు, వార్డ్ మెంబర్లు మరియు పార్టీ అభిమానులు వివిధ కాలనీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు, స్థానిక ప్రజలు, యువత పాల్గొని విజయవంతం చేసినందులకు అందరికీ డివిజన్ తరపున ధన్యవాదాలు తెలిపిన మన్సూరాబాద్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు.