రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి రన్ వేపై 10 నిమిషాల పాటు చిరుత పులి సంచరించినట్లు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ తర్వాత చిరుత.. రషీద్‌గూడ వైపు గోడ దూకి పరుగులు తీసింది. పులి సంచారంతో ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. రషీద్‌గూడ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
