TRSV క్యాలెండర్  ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ :  తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) ఆధ్వర్యంలో రూపొందించిన- 2021 క్యాలెండర్‌ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్వీ వారధిగా పనిచేస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రవి కిరణ్, నెమ్మాది శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.