గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. డేటా సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హమ్మ‌ద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.