రైల్వే ఉద్యోగుల కార్యాల‌యాన్ని ప్రారంభించిన కేటీఆర్

హైద‌రాబాద్ : ‌సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజ‌రై కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రైల్వే ఉద్యోగుల‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్‌, మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, పువ్వాడ అజ‌య్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.మ‌రికాసేప‌ట్లో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఖ‌మ్మం కార్పొరేష‌న్‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించి దిశానిర్దేశం చేయ‌నున్నారు