టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

పట్టణాల్లో కొత్త నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను ప‌ట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమ‌తుల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికి రూపొందించిన‌ ప్రారంభించారు. న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్‌బీపాస్‌ నేటినుంచి అమల్లోకి వచ్చింది. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలను జారీచేయనున్నారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. 600 గజాల లోపు ఇండ్లకు, 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు. ఈ భవనాల నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు జారీచేస్తారు. ఈ వెబ్‌సైట్‌ తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.