నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం:మంత్రి కేటీఆర్

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది.

నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉన్నది.

దేశంలోని 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. కేంద్రం చెప్తున్నట్టు వీరు వేరే రాష్ట్రాలకు వెళ్లి అమ్మే పరిస్థితి లేదు. ఒక రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు ఎక్కువ ధర ఉంటే మిగతా రాష్ట్రాల వాళ్లు పోటెత్తితే స్థానిక రైతులకు నష్టం కలుగుతుంది

కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టు వ్యవసాయం చేసుకోవడానికి నూతన చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఈ కాంట్రాక్టు ఒప్పందాలు బలమైన కార్పొరేట్లకు వరంగా మారి, రైతుకు ఉన్న హక్కులు హరించివేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.

నూతన వ్యవసాయ చట్టం ద్వారా బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించడానికి ఏర్పాటు చేసిన నిత్యావసరాల నిల్వల చట్టాన్ని సవరించారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే ప్రమాదం ఉంది. ఇది రైతులకు, వినియోగదారుడికి ఇద్దరికీ నష్టమే.

దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం నేడు అన్ని రాష్ట్రాల రైతులు కదులుతున్నారు. గత ఆరేళ్లుగా రైతు బంధుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రైతన్నల దేశవ్యాప్త ఆందోళనకు పూర్తి మద్ధతు పలుకుతోంది.

#FarmersProtest
#BharatBandh