ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

ఖమ్మం,తీస్మార్ న్యూస్: ఖమ్మం,వైరా ప్రధాన రహదారి తనికెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని పలువురు ప్రయాణికులకి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తుంది.క్షతగాత్రులని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.అధిక వేగం,వర్షాలు పడుతుండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.