కళ్యాణ లక్ష్మీతో నిరుపేదలకు ప్రభుత్వం అండ…
  • రూ.13 లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్, గురుమూర్తి నగర్, గిరినగర్, రంగారెడ్డి నగర్, చెన్నా రెడ్డి నగర్, సంజయ్ గాంధీ నగర్, వెంకట్ రాంరెడ్డి నగర్, నందా నగర్ లకు చెందిన లబ్ధిదారులకు రూ.13,01,508 విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కావొద్దనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టిందని, ఈ పథకం ద్వారా ఎన్నో నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఎంతో ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గౌసుద్దిన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామ్, వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, అబ్దుల్ ఖాదర్, రహీం, మహబూబి, నాయకులు శంకరయ్య, కాపసుబ్బారెడ్డి, జల్దా రాఘవులు, కార్తిక్, జల్దా లక్ష్మీనాథ్, సతీష్ రెడ్డి, మాధవరెడ్డి, సుధాకర్, ఓంకార్ రెడ్డి, అంజి ముదిరాజ్, బంటి, రాజేష్, బాలు నేత, వేణు యాదవ్, అల్లావుద్దీన్, తేజ తదితరులు పాల్గొన్నారు.