జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో(JNTUH)  ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు

కూకట్ పల్లి,తీస్మార్ న్యూస్ ‌: జేఎన్‌టీయూ హెచ్‌లో ఐదేండ్ల కాలవ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రాం (ఐడీడీఎంపీ)లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ బీటెక్, ఎంఈ, ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీడీఎంపీ)లో భాగంగా బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నది. ఈనెల 18 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

కోర్సులు: బీటెక్‌, ఎంఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ

అర్హతలు: 10+2 లేదా ఇంటర్‌, సీబీఎస్సీ లేదా ఐసీఎస్సీ, తత్సమాన కోర్సులు చేసినవారు.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్స్‌, టీఎస్‌ ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా. జేఈఈ, ఎంసెట్‌ అభ్యర్థులకు చెరో 50 శాతం సీట్లు కేటాయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1500

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 18

ఆలస్య రుసుంతో చివరితేదీ: డిసెంబర్‌ 22

కౌన్సెలింగ్‌: డిసెంబర్‌ 23