వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు.. క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌లోకి దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. బైడెన్ ఎన్నిక సర్టిఫికేషన్ ప్రక్రియను ట్రంప్ అభిమానులు అడ్డుకునే ప్రయత్నంలో బీభత్సం సృష్టించారు. ఉభయసభలు ఉండే భవనంలో జరిగిన హింసలో నలుగురు మృతిచెందారు. అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఓ ట్వీట్‌ను .. కూతురు ఇవాంకా కూడా రీట్వీట్ చేసింది. ఆ తర్వాత ఆమె తన ట్వీట్‌ను డిలీట్ చేసింది. రీట్వీట్ చేసిన ఇవాంకా.. నిరసనకారులను అమెరికా దేశభక్తులంటూ సంబోధించారు. అమెరికా దేశభక్తులారా.. హింసను వెంటనే ఆపండి, శాంతియుతంగా ఉండండి అటూ ఆమె ట్వీట్ చేశారు. ఆందోళనకారులు దేశభక్తులుగా పోల్చడంతో ట్విట్టర్‌లో ఇవాంకాకు హెచ్చరికలు వచ్చాయి. దీంతో ఆమె తన ట్వీట్‌ను డిలీట్ చేశారు.
