హైదరాబాద్,తీస్మార్ న్యూస్ :హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 20కి పైగా బృందాలతో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సాయంత్రం వరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
